బెంగాల్‌లో వ్యవసాయ చట్టాలపై నిరసన.. జాతీయ రహదారి దిగ్బంధం

ABN , First Publish Date - 2021-01-14T00:02:49+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని తూర్పు బర్ద్వాన్‌లో జమాయిత్..

బెంగాల్‌లో వ్యవసాయ చట్టాలపై నిరసన.. జాతీయ రహదారి దిగ్బంధం

కోల్‌కతా: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని తూర్పు బర్ద్వాన్‌లో జమైత్ ఉలేమా-ఇ-హింద్ (జేయూహెచ్) సభ్యులు బుధవారంనాడు నిరసన ప్రదర్శన చేపట్టారు. నేషనల్ హైవే-2ను ప్రదర్శనకారులు దిగ్బంధించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు.


జేయూహెచ్ నేత సిద్ధిఖ్ చౌదరి ఈ సందర్భంగా ప్రదర్శకులను ఉద్దేశించి మాట్లాడుతూ, చట్టాల సమీక్షకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో చట్టాలను వ్యతిరేకిస్తున్న సభ్యులు ఉండాలని అన్నారు. చట్టాలను రద్దు చేసేందుకు రోజువారీ విచారణ జరపాలని సుప్రీంకోర్టును తాము కోరుతున్నామని పేర్కొన్నారు. కాగా, జాతీయ రహదారిపై నిరసనల నేపథ్యంలో పలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Updated Date - 2021-01-14T00:02:49+05:30 IST