జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి

ABN , First Publish Date - 2021-02-08T12:00:53+05:30 IST

తేనిలో జరిగిన జల్లికట్లు పోటీల్లో ఎద్దులు పొడిచిన ఘటనలో ఒకరు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయి. అయ్యంపట్టిలో కరుమారియమ్మన్‌ ఆలయ వేడుకల...

జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి

ఒకరు మృతి, 15 మందికి గాయాలు

చెన్నై/వాషర్‌మెన్‌పేట (ఆంధ్రజ్యోతి): తేనిలో జరిగిన జల్లికట్లు పోటీల్లో ఎద్దులు పొడిచిన ఘటనలో ఒకరు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయి. అయ్యంపట్టిలో కరుమారియమ్మన్‌ ఆలయ వేడుకల సందర్భంగా ఆదివారం జల్లికట్టు పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 300 ఎద్దులు, 200 మంది యువకులు పాల్గొన్నారు. చిన్నమనూరుకు చెందిన మురుగేశన్‌ (28) వడివాసల్‌ మార్గంలో రంకెలేస్తూ వస్తున్న ఎద్దును అదుపుచేసే సమయంలో అతని మొహంపై ఎద్దు పొడవ డంతో సంఘటనాస్థలంలోనే మృతిచెందాడు. అలాగే, పోటీల్లో ఎద్దులు పొడిచి మరో 15 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు, పోటీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2021-02-08T12:00:53+05:30 IST