పాక్‌ అమ్ములపొదిలో జే-10సీ ఫైటర్‌ జెట్స్‌!

ABN , First Publish Date - 2021-12-31T08:55:48+05:30 IST

చైనా నుంచి 25 మల్టీరోల్‌ జే-10సీ యుద్ధవిమానాలను కొనుగోలు చేసినట్టు పాకిస్థాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ తెలిపారు.

పాక్‌ అమ్ములపొదిలో జే-10సీ ఫైటర్‌ జెట్స్‌!

ఇస్లామాబాద్‌, డిసెంబరు 30: చైనా నుంచి 25 మల్టీరోల్‌ జే-10సీ యుద్ధవిమానాలను కొనుగోలు చేసినట్టు పాకిస్థాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ తెలిపారు. ఎటువంటి వాతావరణంలోనైనా ఇవి పనిచేయగలవని చెప్పారు. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ సమకూర్చుకున్న రాఫెల్‌ యుద్ధవిమానాలకు దీటుగానే జే-10సీ ఫైటర్‌ జెట్లను కొనుగోలు చేశామన్నారు. మార్చి 23న వైమానికదళం లో ఇవి చేరనున్నాయని ఆయన చెప్పారు. నిరుడు పాక్‌-చైనా సంయుక్త సైనిక విన్యాసాల్లో జే-10సీ జెట్లు దర్శనమిచ్చాయి. 

Updated Date - 2021-12-31T08:55:48+05:30 IST