పాక్‌లో ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌

ABN , First Publish Date - 2021-02-05T09:07:40+05:30 IST

పాక్‌లో ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌

పాక్‌లో ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసింది. పాక్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ దేశానికి చెందిన ఇద్దరు సైనికులను ఇరాన్‌ విడిపించుకుని తీసుకుపోయింది. పాక్‌లో ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్‌ నిర్వహించి, తమ సైనికులను విడిపించామని ఇరాన్‌కు చెందిన ఎలైట్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం జైష్‌ ఉల్‌ అదల్‌  ఉగ్రవాదులు అపహరించిన తమ సైనికులను విడిపించేందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టామని ప్రకటించింది. 

Updated Date - 2021-02-05T09:07:40+05:30 IST