శ్రీవారి పాదాల చెంతకు ‘ఐపీఎల్‌ కప్‌’

ABN , First Publish Date - 2021-10-19T16:50:33+05:30 IST

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ సాధించిన కప్పుకు ఆ జట్టు యాజమాన్యం స్థానిక టి.నగర్‌ వెంకటనారాయణరోడ్డులో వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం

శ్రీవారి పాదాల చెంతకు ‘ఐపీఎల్‌ కప్‌’

                  - ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎస్‌కే యాజమాన్యం


చెన్నై(chennai): ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ సాధించిన కప్పుకు ఆ జట్టు యాజమాన్యం స్థానిక టి.నగర్‌ వెంకటనారాయణరోడ్డులో వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆ జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ నేతృత్వంలోని బృందం సోమవారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది. స్వామివారి పాదాల చెంత కప్పును పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు అందుకుంది. పూజలు నిర్వ హించిన అనంతరం వేదపండితులు ఆ కప్పును తిరిగి శ్రీనివాసన్‌కే అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు కూడా అయిన శ్రీనివాసన్‌తో పాటు మరో సభ్యుడు శంకర్‌, టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌, మాజీ అధ్యక్షుడు ఆనందకుమార్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ సభ్యుడు పి.మోహన్‌రావు, డిప్యూటీ ఏఈవో విజయకుమార్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ధోనీ భారత్‌కు వచ్చాక కప్పును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కూడా అందిస్తామన్నారు. ఆ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు అనువుగా చిదంబరం స్టేడియంలో నిర్వహిస్తామని వివరించారు. 

Updated Date - 2021-10-19T16:50:33+05:30 IST