ఐపీఎస్ అధికారిణిపై ఐఎఫ్‌ఎస్ అధికారి ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-09-03T18:42:33+05:30 IST
కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి వర్తికా కటియార్‌పై ఆ మె భర్త ఇండియన్ ఫారిన్ సర్వీసస్(ఐఎఫ్‌ఎస్) నితి న్ సుభాష్ తీవ్రమైన ఆరోపణలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం సంచలన

బెంగళూరు: కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి వర్తికా కటియార్‌పై ఆమె భర్త ఇండియన్ ఫారిన్ సర్వీసస్(ఐఎఫ్‌ఎస్) నితి న్ సుభాష్ తీవ్రమైన ఆరోపణలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం సంచలనమైంది. గురువా రం ఛీఫ్‌సెక్రటరీ రవికుమార్‌కు లేఖ అందినట్లు సమాచారం. విధానసౌధలో ఇదే అంశం హాట్‌టాపిక్ అయ్యింది. భార్యాభర్తలమధ్య విభేధాలు తారా స్థాయికి చేరాయి. కర్ణాటక కేడర్ ఐఎఎస్ అధికారి అనురాగ్ తివారి మృతి వెనుక వర్తికా కటియార్ ఉన్నట్లు భర్త నితిన్ సుభాష్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఛీఫ్ సెక్రటరీకు రాసిన లేఖలో పొందుపరిచారు. వర్తి కా కటియార్ మానసిక స్థితి బాగాలేదని ఇతరులతో కలిసి తిరుగుతారని, క్యాసినోలకు శ్రీలంక, స్విట్జర్‌లాండ్, ఇటలీలతో పాటు ఇతర దేశాలకు వెళ్ళారని లేఖలో ప్రసావించినట్లు తెలుస్తోంది. అనురాగ్ తివారీ మృతితో పాటు అన్ని అంశాలపైనా సమగ్ర విచారణలు జరిపించాలని లేఖలో నితిన్ సుభాష్ కోరినట్లు సమాచారం.