మీ పిల్లలకు ఇన్‌స్టా అకౌంట్ ఉందా..? అయితే.. మీకో ముఖ్యగమనిక!

ABN , First Publish Date - 2021-07-29T21:03:22+05:30 IST

ఇన్‌స్టా సేఫ్టీ పీచర్ల వివరాలను సంస్థ తాజాగా తెలుగులో విడుదల చేసింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లల భద్రత పెంపొందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని తల్లిందండ్రులు వీటిపై అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేసింది.

మీ పిల్లలకు ఇన్‌స్టా అకౌంట్ ఉందా..? అయితే.. మీకో ముఖ్యగమనిక!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ జమానాలో సోషల్ మీడియా ప్రాముఖ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక పదమూడేళ్లు, ఆపై వయసున్న వారందరూ సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు! మరోవైపు.. డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లతో ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. కానీ.. అపాయం ఏవైపు నుంచి వస్తుందో తెలుసుకోగలిగే అనుభవం పిల్లలకు ఉండదు. దీంతో.. పిల్లల భద్రత కోసం ఇన్‌స్టాగ్రామ్ ఎన్నో సేఫ్టీ ఫీచర్లను ఏర్పాటు చేసింది. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టా సేఫ్టీ ఫీచర్ల వివరాలను సంస్థ తాజాగా తెలుగులో విడుదల చేసింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లల భద్రత పెంపొందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని తల్లిందండ్రులు ఈ పేరెంట్స్ సేఫ్టీ గైడ్‌ ద్వారా అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. పిల్లల భద్రతకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఇన్‌స్టా ఈ సందర్భంగా పేర్కొంది.  



Updated Date - 2021-07-29T21:03:22+05:30 IST