‘ఫైజర్’తో లక్షణాల్లేని ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం
ABN , First Publish Date - 2021-05-08T09:29:49+05:30 IST
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ లక్షణాల్లేని, లక్షణాలున్న ఇన్ఫెక్షన్ల ముప్పు 79 శాతం తగ్గిందని అమెరికాలోని సెయింట్ జూడ్ చిల్ర్డెన్స్ రిసెర్చ్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

న్యూఢిల్లీ, మే 7 : ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ లక్షణాల్లేని, లక్షణాలున్న ఇన్ఫెక్షన్ల ముప్పు 79 శాతం తగ్గిందని అమెరికాలోని సెయింట్ జూడ్ చిల్ర్డెన్స్ రిసెర్చ్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. లక్షణాల్లేని కొవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పు.. టీకా మొదటి డోసు తీసుకున్న తర్వాత 72 శాతం తగ్గగా, రెండో డోసు తర్వాత 96 శాతం మేర తగ్గిందన్నారు. ఈ అధ్యయనంలో 5,217 మంది పాల్గొన్నారు. వీరిలో మొత్తం 236 మందికి కొవిడ్ ‘పాజిటివ్’ రాగా, వీరిలో టీకా తీసుకోని వారే అత్యధికంగా 185 మంది ఉండటం గమనార్హం. పాజిటివ్ వచ్చిన మరో 51 మంది టీకా మొదటి డోసు తీసుకున్న వారేనని తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన వారిలో దాదాపు సగం మంది (108)లో లక్షణాల్లేని ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు.