ఇండోనేషియా విమాన ప్రమాదం... బ్లాక్ బాక్స్ జాడ దొరికింది..

ABN , First Publish Date - 2021-01-12T23:29:32+05:30 IST

ఇండోనేషియాలో ఇటీవల కూలిపోయిన శ్రీవిజయ ఎయిర్‌ఫ్లైట్ 182కి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది. మంగళవారం ఇండోనేషియన్...

ఇండోనేషియా విమాన ప్రమాదం... బ్లాక్ బాక్స్ జాడ దొరికింది..

జకర్తా: ఇండోనేషియాలో ఇటీవల కూలిపోయిన శ్రీవిజయ ఎయిర్‌ఫ్లైట్ 182కి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది. మంగళవారం ఇండోనేషియన్ నేవీ డైవర్లు దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 62 మందిని బలితీసుకున్నట్టు చెబుతున్న బోయింగ్ 737-500 విమానానికి ఏమైందో గుర్తించేందుకు ఈ బ్లాక్ బాక్స్ ఉపకరిస్తుందని భావిస్తున్నారు. శ‌నివారం జ‌కర్తా నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే విమానం స‌మీప స‌ముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ ఓ పెద్ద కంటైనర్‌లో డైవర్లు బ్లాక్ బాక్సును సేకరిస్తున్నట్టు స్థానిక టీవీ ఛానెళ్లు చూపించాయి. అయితే అందులో ఉన్నది విమానం కాక్‌పిట్ వాయిస్ రికార్డరా లేక ఫ్లైట్ డేటా పరికరమా అన్నది తెలియరాలేదు. విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్న నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీకి ఇంకా దీన్ని అప్పగించలేదు. సముద్రంలో గాలింపు చేపట్టిన నేవీ షిప్‌కి బ్లాక్ బాక్స్ నుంచి ఇవాళ బలమైన సిగ్నళ్లు అందాయి. అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున విమాన శకలాలు కూడా లభించినట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-01-12T23:29:32+05:30 IST