భారతీయులు గినియా పందులు కాదు: మనీష్ తివారీ

ABN , First Publish Date - 2021-01-13T21:39:15+05:30 IST

'కొవాక్సిన్' సామర్థ్యంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మరోసారి సందేహం ..

భారతీయులు గినియా పందులు కాదు: మనీష్ తివారీ

న్యూఢిల్లీ: 'కొవాక్సిన్' సామర్థ్యంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మరోసారి సందేహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి మాత్రమే కొవాక్సిన్‌కు ప్రభుత్వ అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వాక్సిన్ వేయించుకునే వారు ఫలానా వ్యాక్సినే కావాలని అడగరాదని చెబుతోందని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. కొవాక్సిన్ థర్ట్ ట్రయిల్ ఇంకా పూర్తి కాలేదని, ఇది వ్యాక్సిన్ సామర్థ్యంపై అనుమానాలు, ఆందోళనలకు తావిస్తోందని పేర్కొన్నారు.


'కొవాక్సిన్ సామర్థ్యం, విశ్వసనీయత నిరూపితమయ్యేంత వరకూ కొవాక్సిన్‌ను అమలు చేయరాదు. ఫేజ్-3 ట్రయిల్స్ పూర్తి కావాలి. ప్రజల్లో వ్యాక్సిన్‌పై ప్రభుత్వం ధీమా కలిగించాలి. ఫేజ్-3 ట్రయిల్స్ పూర్తికాకుండా కొవాక్సిన్ అమలు చేయడానికి భారతీయులు గినియా పందులు కాదు' అని మనీష్ తివారీ అన్నారు.

Updated Date - 2021-01-13T21:39:15+05:30 IST