rescue: మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలకు భారత నావికాదళాలు

ABN , First Publish Date - 2021-07-24T18:23:33+05:30 IST

భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తిన నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో సహాయ పునరావాస పనులు చేపట్టేందుకు...

rescue: మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలకు భారత నావికాదళాలు

న్యూఢిల్లీ : భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తిన నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో సహాయ పునరావాస పనులు చేపట్టేందుకు భారత నావికాదళాలను కేంద్రం రంగంలోకి దించింది.వరదపీడిత రాష్ట్రాలైన మహారాష్ట్ర,కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో నావికాదళాలను మోహరించారు. వరదనీటితో పలు నదులు, జలాశయాలు పొంగి ప్రవహిస్తుండంతో లోతట్టుప్రాంతాలు, తీరప్రాంతాల ప్రజలను కాపాడేందుకు నావికాదళం రంగంలోకి దిగింది. ఏడు నావికాదళం వరదసహాయక బృందాలు ముంబై నుంచి రత్నగిరి, రాయిగడ్ జిల్లాలకు పంపించారు. రాయిగడ్ జిల్లా పొలాద్ పూర్ ప్రాంతంలో హెలికాప్టర్లను రంగంలోకి దించారు. 


వరదల రీత్యా సహాయ పునరావాస పనులను ముమ్మరం చేశారు. ఉత్తర కన్నడ జిల్ాలోని కద్రా డ్యాం, మల్లాపూర్ కుర్నిపేట, కైగా ప్రాంతాలు జలమయం కావడంతో తోట్టుప్రాంతాల ప్రజలను కాపాడేందుకు లైఫ్ జాకెట్లు, లైఫ్ బోట్లను రప్పించారు. సహాయ బృందాలు 100 మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.డోంగ్రీలోని గంగవల్లి నదిలో చిక్కుకున్న 8మందిని హెలికాప్టరు ద్వారా కాపాడారు.


Updated Date - 2021-07-24T18:23:33+05:30 IST