నేపాల్‌కు ఆక్సిజన్ సరఫరా చేయనున్న భారత్

ABN , First Publish Date - 2021-05-18T06:04:20+05:30 IST

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో సంక్షోభంలో ఉన్న భారత్.. మన పొరుగు దేశం నేపాల్‌కు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అంగీకరించింది. రానున్న 8 నుంచి 10 రోజుల్లో భారత్ నుంచి నేపాల్‌కు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని నేపాల్‌లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు.

నేపాల్‌కు ఆక్సిజన్ సరఫరా చేయనున్న భారత్

న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో సంక్షోభంలో ఉన్న భారత్.. మన పొరుగు దేశం నేపాల్‌కు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అంగీకరించింది. రానున్న 8 నుంచి 10 రోజుల్లో భారత్ నుంచి నేపాల్‌కు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని నేపాల్‌లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం నాడు ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం నేపాల్‌లో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేపాల్‌కు భారత్ అండగా ఉంటుందని వినయ్ మోహన్ స్పష్టం చేశారు. ఇప్పటికే నేపాల్‌కు 2 మిలియన్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపినట్లు ఆయన తెలిపారు. నేపాల్‌లో ఒక్క సోమవారమే 9,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కరోనా విజృంభణ చూసి చైనా కూడా తమ ప్రజలెవరూ నేపాల్ వెళ్లద్దని ఆంక్షలు విధించింది.

Updated Date - 2021-05-18T06:04:20+05:30 IST