Modi : చాను విజయంతో భారత్ ఉప్పొంగుతోంది
ABN , First Publish Date - 2021-07-24T18:44:40+05:30 IST
టోక్యో వేదికగా జరుగుతున్న ఒలంపిక్స్‌లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన వీరోచిత

న్యూఢిల్లీ : టోక్యో వేదికగా జరుగుతున్న ఒలంపిక్స్‌లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీతో సహా పలువురు శుకాంక్షలు తెలిపారు. ‘‘టోక్యో ఒలంపిక్స్‌లో రజత పతకం గెలిచి, భారత్‌కు బోణీ అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు అభినందనలు’’ అంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీరాబాయి ప్రదర్శనతో భారత్ ఉప్పొంగుతోంది. రజత పతకం సాధించినందుకు అభినందనలు. ఆమె సాధించిన విజయం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమే’’ అని మోదీ పేర్కొన్నారు. వీరితో పాటు కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.