చేతులు కలపనున్న భారత్, పాక్, చైనా.. దేనికోసం అంటే?

ABN , First Publish Date - 2021-03-22T11:35:45+05:30 IST

ఉగ్రవాదంపై పోరాటం చేయడం కోసం భారత్, దాయాది పాకిస్తాన్, డ్రాగన్ దేశం చైనా కలిసి పనిచేయనున్నాయి. ఈ దేశాలే కాదు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌‌‌సీవో)కు చెందిన వివిధ దేశాలు కూడా ఈ మిషన్‌లో పాల్గొంటాయి.

చేతులు కలపనున్న భారత్, పాక్, చైనా.. దేనికోసం అంటే?

ఉజ్బెకిస్తాన్: ఉగ్రవాదంపై పోరాటం చేయడం కోసం భారత్, దాయాది పాకిస్తాన్, డ్రాగన్ దేశం చైనా కలిసి పనిచేయనున్నాయి. ఈ దేశాలే కాదు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌‌‌సీవో)కు చెందిన వివిధ దేశాలు కూడా ఈ మిషన్‌లో పాల్గొంటాయి. ఈ ఏడాది ఎస్‌సీవోలోని దేశాలన్నీ కలిసి సంయుక్తంగా ఉగ్రవాద వ్యతిరేక ఎక్సర్‌సైజులో పాల్గొనాలని నిర్ణయించాయి. ‘‘పబ్బి-యాంటీటెర్రర్-2021’’ పేరిట ఈ ఎక్సర్‌సైజు జరగనుందట. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘‘ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం అందే మార్గాలను అణిచివేయడం ద్వారా ఎస్‌సీవో భాగస్వాముల మధ్య బంధాన్ని బలోపేతం చేయడం కోసం కొన్ని నిర్ఱయాలు తీసుకోవడం జరిగింది’’ అని అధికారిక ప్రకటన పేర్కొంటుంది.

Updated Date - 2021-03-22T11:35:45+05:30 IST