భారత్‌లో 415కి చేరిన Omicron కేసులు

ABN , First Publish Date - 2021-12-25T15:42:10+05:30 IST

దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

భారత్‌లో 415కి చేరిన Omicron కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 415కి చేరింది. అలాగే ఈ వైరస్ బారిన పడి 115 మంది కోలుకున్నారు. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నరాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర 108, ఢిల్లీ 79, గుజరాత్ 43, తెలంగాణ 38, కేరళ 37, తమిళనాడు 34, కర్నాటక 31, రాజస్థాన్ 22 ఉన్నాయి. 

Updated Date - 2021-12-25T15:42:10+05:30 IST