మళ్లీ పెరిగిన కరోనా కేసులు: కొత్తగా 39,097 నమోదు...546 మంది మృతి!

ABN , First Publish Date - 2021-07-24T15:58:41+05:30 IST

దేశంలో కరోనా గ్రాఫ్ ఒకరోజు పైకి ఎగబాకుతుండగా...

మళ్లీ పెరిగిన కరోనా కేసులు: కొత్తగా 39,097 నమోదు...546 మంది మృతి!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా గ్రాఫ్ ఒకరోజు పైకి ఎగబాకుతుండగా, మర్నాడు కిందకు దిగజారుతోంది. తాజాగా కరోనా గ్రాఫ్ పైకి ఎగబాకింది. దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 39 వేల 97 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో 546 మంది మృతి చెందారు. కొత్త కేసులతో కలిపి చూసుకుంటే ఇప్పటివరకూ దేశంలో మొత్తం 3 కోట్ల, 13 లక్షల, 159 మంది కరోనా బారిన పడ్డారు. 


ప్రస్తుతం దేశంలో 4 లక్షల 8 వేల 977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా 3 కోట్ల 5 లక్షల 3 వేల 166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4 లక్షల 20 వేల 16 మంది కరోనా కారణంగా కన్నుమూశారు. గడచిన 24 గంటల్లో దేశంలో 42 లక్షల, 67 వేల 799 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు.

Updated Date - 2021-07-24T15:58:41+05:30 IST