బండ బాదుడు!
ABN , First Publish Date - 2021-09-02T09:46:21+05:30 IST
వంట గ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది.
న్యూఢిల్లీ, హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను చమురు కంపెనీలు బుధవారం మరో రూ.25 మేర పెంచాయి. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.937కు చేరింది. గత నెల 18న సిలిండర్ ధర రూ.25 పెరిగింది. దీంతో పక్షం రోజుల్లోనే ధర రూ.50 పెరిగినట్లయింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.80 పెరిగి రూ.1,798 నుంచి రూ.1,878కి చేరింది. తాజాగా సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధరను పెంచడంతో జనవరి 1 నుంచి ఒక్కో సిలిండర్ ధర రూ.190పెరిగినట్లయింది. ఏడేళ్లలో గృహావసరాలకు వినియోగించే గ్యాస్ ధర రెండింతలకు పైగా పెరిగింది. కాగా, ఏడేళ్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంపుతో వచ్చిన రూ.23 లక్షల కోట్లు ఏం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రశ్నించారు.