స్కూల్‌ ఆవరణలో 215 మృతదేహాల అవశేషాలు!

ABN , First Publish Date - 2021-05-30T10:00:58+05:30 IST

కెనడాలో దారుణం వెలుగుచూసింది. ఓ పురాతనమైన స్కూల్‌లో 215 మృతదేహాల అవశేషాలు బయల్పడ్డాయి. వీటిలో ఎక్కువ మూడు సంవత్సరాల లోపు వయసు పిల్లలవేనని

స్కూల్‌ ఆవరణలో 215 మృతదేహాల అవశేషాలు!

ఎక్కువ మంది మూడేళ్లలోపు పిల్లలే!

కెనడాలో గ్రౌండ్‌ రాడార్‌ సెర్చ్‌తో వెలుగులోకి దారుణం


క్యామ్‌లూప్స్‌ (కెనడా), మే 29: కెనడాలో దారుణం వెలుగుచూసింది. ఓ పురాతనమైన స్కూల్‌లో 215 మృతదేహాల అవశేషాలు బయల్పడ్డాయి. వీటిలో ఎక్కువ మూడు సంవత్సరాల లోపు వయసు పిల్లలవేనని తేలింది. ఈ స్కూల్‌ ఆవరణలో గత వారం గ్రౌండ్‌ రాడార్‌ సాయంతో జరిపిన సెర్చ్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. 1890 నుంచి 1969 వరకు రెసిడెన్షియల్‌ పాఠశాలగా పనిచేయగా.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునే వారు. ఆ సమయంలో విద్యార్థులపై అనేక అకృత్యాలు జరిగేవని ఆరోపణలు ఉన్నాయి.


కనీసం 3,200 మంది పిల్లలు వేధింపులకు గురై మరణించి ఉంటారని, స్కూల్‌ ఆవరణ మొత్తంగా గాలిస్తే మరిన్ని మృత అవశేషాలు వెలుగులోకి రావచ్చని చెబుతున్నారు. బ్రిటిష్‌ కొలంబియా ప్రీమియర్‌ జాన్‌ హోర్గాన్‌ మాట్లాడుతూ.. ఇది హృదయవిదారకమైన, అత్యంత భయానకమైన ఘటనని, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో జరిగే హింసను ఎత్తిచూపే అనూహ్యమైన విషాదమని అన్నారు. ఈ మరణాలన్నీ రికార్డుల్లోకి చేరి ఉండవని అనుమానం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-30T10:00:58+05:30 IST