శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్ నిజమే
ABN , First Publish Date - 2021-08-25T07:48:23+05:30 IST
కన్నడ సినీ పరిశ్రమ శాండిల్‌వుడ్‌లో పలువురు తారలు నిషేధి త డ్రగ్స్ వినియోగించినట్టు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది.

హీరోయిన్లు రాగిణి, సంజనలు డ్రగ్స్
తీసుకున్నారని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
బెంగళూరు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కన్నడ సినీ పరిశ్రమ శాండిల్‌వుడ్‌లో పలువురు తారలు నిషేధి త డ్రగ్స్ వినియోగించినట్టు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా హీరోయిన్‌లు రాగిణి, సంజన లు డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదిక పేర్కొంది. ఈ తాజా పరిణామాలతో శాండిల్‌వుడ్‌లో మళ్లీ కలకలం రేగిం ది. దీనికి సంబంధించిన కథనాలు మీడియాలో రావడంతో ఈ హీరోయిన్‌లు ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో కొన్నాళ్ల కిందట సినీ పరిశ్రమతో డ్రగ్స్‌మాఫియా లింకుల విషయం జాతీయస్థాయిలో సంచలనం సృష్టించింది. అప్పట్లో కొం దరు నటీనటులకు సంబంధించిన రక్త నమూనాల ను సేకరించి హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎ్‌సఎల్‌కు సీసీబీ పోలీసులు పంపించారు. ఈ నివేదికలో ఇద్ద రు హీరోయిన్‌లతో పలువురు మాదకద్రవ్యాలు సేవించినట్టు తేలిందని సీసీబీ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. నటులతోపాటు వీకెండ్ పార్టీలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు, డ్రగ్‌పెడ్లర్ లు కూడా మాదకద్రవ్యాల మత్తులో జోగినట్టు తాజా పరీక్షా ఫలితాలు రుజువు చేస్తున్నాయన్నారు. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి కొందరి తలవెంట్రులను కూడా ఎఫ్‌ఎ్‌సఎల్ పరీక్షలకు పంపించారు. ఇంతవరకు ఎన్‌డీపీఎ్‌స కింద దాఖలైన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి రక్తం, మూ త్రం నమూనాలను పంపడం సాధారణంగా జరుగుతోంది. అయితే.. తలవెంట్రుకల పరీక్షల్లో వచ్చే నివేదికకు తిరుగు ఉండదని పోలీసు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల కేసులో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని నగర పోలీ్‌సకమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పోలీసు అధికారులతో సమాలోచనలు జరిపారు.