మధ్యప్రదేశ్‌లో చెలరేగిపోతున్న బ్లాక్ ఫంగస్.. నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-22T00:31:53+05:30 IST

మధ్యప్రదేశ్‌‌ను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడి తాజాగా నలుగురు మృత్యువాత పడ్డారు. దామో,

మధ్యప్రదేశ్‌లో చెలరేగిపోతున్న బ్లాక్ ఫంగస్.. నలుగురి మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌‌ను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడి తాజాగా నలుగురు మృత్యువాత పడ్డారు. బాధితులు దామో, బాలాఘాట్‌కు చెందిన వారు. దీపక్ సోని (39), నితిన్ జైన్ (30) ఇద్దరూ దామో జిల్లాకు చెందిన వారు కాగా, శేష్‌రామ్ కుచలాహి (38), చిను లాల్వాని (42)లు బాలాఘాట్‌కు చెందిన వారు. వీరందరు కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ బారినపడి మరణించినట్టు వైద్యులు తెలిపారు. సోనీ నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో మరణించగా, జజైన్ దామోలో మృతి చెందాడు. మ్యూకోర్మైకోసిస్ బారినపడిన మరో నలుగురిని చికిత్స కోసం భోపాల్ పంపినట్టు దామో ఈఎన్‌టీ స్పెషలిస్ట్ విశాల్ శుక్లా తెలిపారు. 


శేష్‌రామ్ బాలాఘాట్‌లోని జిల్లా ఆసుపత్రిలో నిన్న మరణించినట్టు లాంజీ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ గెడమ్ తెలిపారు. లాల్వానీ పది రోజుల చికిత్స అనంతరం బుధవారం నాగ్‌పూర్ ఆసుపత్రిలో మరణించినట్టు బాలాఘాట్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ పాండే తెలిపారు. బ్లాక్ ఫంగ్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు తమ జిల్లాల్లో లేవని దామో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగీతా త్రివేది, బాలాఘాట్ మెడికల్ అధికారి డాక్టర్ మనోజ్ తెలిపారు.   

Updated Date - 2021-05-22T00:31:53+05:30 IST