‘బ్లాక్‌ ఫంగస్‌’కు ఇంజెక్షన్లు దిగుమతి చేసుకోండి

ABN , First Publish Date - 2021-05-21T08:50:10+05:30 IST

బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో అత్యంత కీలకమైన యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను సమకూర్చుకోవాలని, అవసరమైతే.. ఆ ఇంజక్షన్‌ను ఉత్పత్తి చేసే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని..

‘బ్లాక్‌ ఫంగస్‌’కు ఇంజెక్షన్లు దిగుమతి చేసుకోండి

న్యూఢిల్లీ, మే 20: బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో అత్యంత కీలకమైన యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను సమకూర్చుకోవాలని, అవసరమైతే.. ఆ ఇంజక్షన్‌ను ఉత్పత్తి చేసే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఆరులక్షల వయల్స్‌ దిగుమతికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రం తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ జస్మీత్‌సింగ్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. మీనమేషాలు లెక్కించకుండా.. వీలైనంత త్వరగా యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను సిద్ధంగా పెట్టాలని సూచించింది.

Updated Date - 2021-05-21T08:50:10+05:30 IST