ఢిల్లీ, యూపీ, హర్యానాల్లో నేడు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-07-05T13:32:26+05:30 IST

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని...

ఢిల్లీ, యూపీ, హర్యానాల్లో నేడు భారీవర్షాలు

భారత వాతావరణశాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ : ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తాజాగా వెల్లడించింది.తేలికపాటి నుంచి భారీ వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరభారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని నైరుతి ఢిల్లీ, ఫరూఖ్ నగర్, భివానీ, చార్కి-దాద్రి, భివాడి, జార్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం ఉదయం ట్వీట్ చేసింది.


ఢిల్లీలో శనివారం వర్షం కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. విరామం అనంతరం రుతుపవనాలు మళ్లీ చురుకైన దశలోకి ప్రవేశిస్తున్నాయని, దీనివల్ల జులై 8వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ చెప్పారు. రుతుపవనాల ప్రభావం వల్ల రాజస్థాన్, యూపీ, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.


Updated Date - 2021-07-05T13:32:26+05:30 IST