మాకు కోవిడ్ సోకితే మోదీ వైఫల్యమే: నిరసన చేస్తున్న రైతులు

ABN , First Publish Date - 2021-05-13T22:32:42+05:30 IST

ఈ విషయమై ఆందోళనలో ఉన్న రైతులను ప్రశ్నించగా తమకు కోవిడ్ సోకితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఫల్యమే అవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో పెద్ద ఎత్తున చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆందోళనలో ఉన్న రైతులను పరిగణలోకి

మాకు కోవిడ్ సోకితే మోదీ వైఫల్యమే: నిరసన చేస్తున్న రైతులు

న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 167 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న వేలాది మంది రైతులు అనేక మందికి కోవిడ్ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతానికి ఆందోళనలో ఉన్న రైతుల్లో చాలా తక్కువ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసలు వెలుగు చూశాయి. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని చెప్పలేం. కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న ఢిల్లీ సరిహద్దుల్లోనే వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా సరిహద్దులో ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది.


ఈ విషయమై ఆందోళనలో ఉన్న రైతులను ప్రశ్నించగా తమకు కోవిడ్ సోకితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఫల్యమే అవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో పెద్ద ఎత్తున చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆందోళనలో ఉన్న రైతులను పరిగణలోకి తీసుకోలేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టిక్రీ సరిహద్దులో మీడియాతో భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవాల్) సభ్యులు మాట్లాడుతూ ‘‘దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. మా డిమాండ్లను ఒప్పుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. ఆందోళనలో ఉన్న కొంత మందికి ఇప్పటికే కోవిడ్ సోకింది. ఒకరిద్దరు కోవిడ్ వల్ల చనిపోయారు. ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నట్లు చెప్తోంది. కానీ ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలో ఉన్న రైతులకు టీకాలు వేయడం లేదు. కోవిడ్ పేరుతో మమ్మల్ని నిరసన నుంచి తరలించాలని ప్రభుత్వం చూస్తోంది’’ అని అన్నారు.

Updated Date - 2021-05-13T22:32:42+05:30 IST