కుమార్తెకు పెళ్లిలో ఇచ్చే బహుమతులు వరకట్నం కాదు : కేరళ హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-15T23:51:22+05:30 IST

తల్లిదండ్రులు తమ కుమార్తె సంక్షేమం కోసం స్వచ్ఛందంగా,

కుమార్తెకు పెళ్లిలో ఇచ్చే బహుమతులు వరకట్నం కాదు : కేరళ హైకోర్టు

కొచ్చి : తల్లిదండ్రులు తమ కుమార్తె సంక్షేమం కోసం స్వచ్ఛందంగా, వరుని తరపువారు డిమాండ్ చేయకపోయినా, బహుమతులు ఇచ్చినట్లయితే, వరకట్న నిషేధ చట్టం, 1961 ప్రకారం వరకట్నంగా పేర్కొనలేమని కేరళ హైకోర్టు తెలిపింది. వరకట్న నిషేధ అధికారి జారీ చేసిన ఆర్డర్‌ను సవాలు చేస్తూ ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. 


వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3(1) వరకట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం నేరమని చెప్తున్నాయని జస్టిస్ ఎంఆర్ అనిత చెప్పారు. వధువుకు బహుమతులు ఇవ్వాలని వరుని తరపువారు ఎవరూ కోరకుండానే, వధువు తల్లిదండ్రులు ఆమె సంక్షేమం కోసం పెళ్లి సమయంలో బహుమతులు ఇచ్చినపుడు, ఆ బహుమతులను ఈ చట్టం ప్రకారం రూపొందించిన జాబితాలో చేర్చినపుడు, వాటిని ఈ సెక్షన్ 3(1) ప్రకారం వరకట్నంగా పరిగణించలేమని తెలిపారు. 


కోర్టుకు ఈ కేసులోని భర్త తెలిపిన వివరాల ప్రకారం, ఆయనకు 2020లో హిందూ సంప్రదాయం ప్రకారం ఓ యువతితో వివాహం జరిగింది. కొద్ది కాలానికి వారి మధ్య పొరపొచ్చాలు రావడంతో ఆమె వరకట్న నోడల్ అధికారి వద్ద ఫిర్యాదు చేసి, విడాకులు కోరారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఆభరణాలన్నిటినీ బ్యాంకు లాకర్‌లో ఉంచారు. ఈ దంపతుల పేరు మీద ఆ లాకర్‌ను తీసుకుని, దాని తాళాలను ఆమె వద్ద ఉంచారు. తన సంక్షేమం కోసం తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆభరణాలను తిరిగి ఇవ్వడం లేదని ఆమె నోడల్ అధికారికి ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-12-15T23:51:22+05:30 IST