ఇంట్లోనే కరోనా టెస్టు: ఐసీఎంఆర్ అనుమ‌తి

ABN , First Publish Date - 2021-05-20T11:40:20+05:30 IST

ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ ఇప్పుడు...

ఇంట్లోనే కరోనా టెస్టు: ఐసీఎంఆర్ అనుమ‌తి

న్యూఢిల్లీ: ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ ఇప్పుడు కరోనా టెస్టు కోసం మ‌రో విధానానికి కూడా అనుమ‌తి నిచ్చింది. దీని ప్ర‌కారం క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు స్వ‌యంగా టెస్టు చేసుకోగ‌లుగుతారు. ఈ యాంటిజెన్ పరీక్షకు సంబంధించిన కిట్‌కు ఐసీఎంఆర్ అనుమ‌తినిచ్చింది. ఈ కిట్ ద్వారా క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌వారు త‌మ ఇంట్లోనే ముక్కు ద్వారా కరోనాను టెస్టు న‌మూనా తీసుకోవ‌చ్చు.


పూణెలోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్  రూపొందించిన హోమ్ ఐసోలేషన్ టెస్టింగ్ కిట్ వినియోగానికి ఐసీఎంఆర్ నుంచి అనుమ‌తి ల‌భించింది. ఈ కిట్‌కు కోవిసెల్ఫ్ అనే పేరు పెట్టారు. ఈ కిట్‌ను వినియోగించేందుకు మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా పాజిటివ్ లేదా నెగిటివ్ రిపోర్టు అందుకోవ‌చ్చు. హోమ్ టెస్టింగ్ చేసుకునేవారు తాము ఫోనులో డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ నుంచి టెస్ట్ స్ట్రిప్ పిక్చర్ తీసుకోవాల్సివుంటుంది. ఈ  డేటా నేరుగా ఐసీఎంఆర్ క‌రోనా టెస్టుల‌ పోర్టల్‌లో సేవ్ అవుతుంది. బాధితుల‌ వివ‌రాల గోప్యంగా ఉంటాయి. ఈ విధంగా టెస్టు చేసుకున్నాక మ‌రో టెస్టు అవ‌స‌రం లేదు. ఈ టెస్టు ద్వారా పాజిటివ్ వ‌చ్చిన‌వారు హోంఐసొలేష‌న్‌లో ఉంటూ ఐసీఎంఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. నెగిటివ్ రిపోర్టు వ‌చ్చేవ‌ర‌కూ హోం ఐసొలేష‌న్‌లోనే ఉండాలి.

Updated Date - 2021-05-20T11:40:20+05:30 IST