2.66 కోట్ల విరాళాలు సేకరించిన ఐసీసీసీ

ABN , First Publish Date - 2021-05-18T07:50:01+05:30 IST

భారత్‌కు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు పంపడం కోసం ఇండో-కెనడా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీసీ) ఇతర 82 స్వచ్ఛంద సంస్థలతో కలిసి తొలిదశలో రూ.2.66 కోట్ల విరాళాలు సేకరించింది

2.66 కోట్ల విరాళాలు సేకరించిన ఐసీసీసీ

భారత్‌కు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు 


టొరంటో, మే 17: భారత్‌కు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు పంపడం కోసం ఇండో-కెనడా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీసీ) ఇతర 82 స్వచ్ఛంద సంస్థలతో కలిసి తొలిదశలో రూ.2.66 కోట్ల విరాళాలు సేకరించింది. ఈ విరాళాల సేకరణ కార్యక్రమం మరో నెల రోజుల పాటు కొనసాగుతుందని ఐసీసీసీ చెప్పింది. భారత్‌కు ఆక్సిజన్‌ పంపడానికి కృషి చేస్తామని వివరించింది. కాగా, కెనడా రెడ్‌ క్రాస్‌ సంస్థ ద్వారా భారత రెడ్‌ క్రాస్‌ సంస్థకు భారత్‌లో కరోనా సాయం చేయడానికి కెనడా ప్రభుత్వం గత నెల 60 కోట్ల రూపాయలు కేటాయించింది.

Updated Date - 2021-05-18T07:50:01+05:30 IST