తెగడిన నోటే పొగడ్తలు

ABN , First Publish Date - 2021-05-13T08:59:53+05:30 IST

ఐఏఎస్‌ అధికారి ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌.. బృహన్‌ ముంబై మునిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) కమిషనర్‌గా ఇప్పుడు ఆయన ఓ హీరో! కరోనా కేసులతో ముంబై అతలాకుతలం అవుతున్న

తెగడిన నోటే పొగడ్తలు

కరోనా కట్టడిలో ఐఏఎస్‌ ఇక్బాల్‌ సింగ్‌ గొప్ప కృషి

గతంలో మోదీ ఆగ్రహానికి గురైన అధికారి

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు


న్యూఢిల్లీ, మే 12: ఐఏఎస్‌ అధికారి ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌..  బృహన్‌ ముంబై మునిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) కమిషనర్‌గా ఇప్పుడు ఆయన ఓ హీరో! కరోనా కేసులతో ముంబై అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో బీఎంసీ కమిషనర్‌గా ఏడాది క్రితం బాధ్యతలు తీసుకొని, ఆ మహానగరాన్ని వైరస్‌ సంకటస్థితి నుంచి ఇక్బాల్‌ గట్టెక్కించడంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకుగాను ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా ఇక్బాల్‌ ‘లోక్‌మత్‌ మహారాష్ట్రియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021’ అవార్డును అందుకున్నారు. అయితే ఇక్బాల్‌పై ఇప్పుడు పొగడ్తలు కురిపిస్తున్న ఎన్డీయే సర్కారు..


డిప్యుటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసిన ఆయనపై ఐదేళ్ల క్రితం సరైన తీరులో వ్యవహరించలేదు. సరైన కారణం లేకుండా డిప్యుటేషన్‌ గడువు మరో మూడేళ్లు మిగిలివుండగానే ఆయన్ను మహారాష్ట్ర కేడర్‌కు తిప్పి పంపేసింది. ఇక్బాల్‌.. 1989 బ్యాచ్‌ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.  2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి ఇక్బాల్‌ ప్రాధాన్యాన్ని  బాగా తగ్గించారు. 2015లో ఆయన్ను అంతగా ప్రాధాన్యం లేని మహిళాశిశు సంక్షేమశాఖకు మార్చారు. ఆ సమయంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న మేనకా గాంధీతో విభేదాలు రావడంతో సెలవులపేరుతో ఆయన్ను పక్కనబెట్టారు. కేంద్ర ప్రభుత్వంలో ఐఎ్‌సఎస్‌ అధికారిగా ఇక్బాల్‌ గొప్ప పేరు తెచ్చుకున్నప్పటికీ ఆయన్ను మోదీ సర్కారు.. కాంగ్రె్‌సకు సన్నిహితుడిగా ఉన్న అధికారి అనే కోణంలో చూసిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-13T08:59:53+05:30 IST