నేను ఇక్కడే, మీరు అక్కడే: యడియూరప్ప

ABN , First Publish Date - 2021-02-06T20:44:11+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ చివరి రోజైన శనివారంనాడు మాజీ సీఎం సిద్ధరామయ్యపై ముఖ్యమంత్రి..

నేను ఇక్కడే, మీరు అక్కడే: యడియూరప్ప

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ చివరి రోజైన శనివారంనాడు మాజీ సీఎం సిద్ధరామయ్యపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విరుచుకుప్డడారు. 'నేను ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను. కాంగ్రెస్ విపక్షానికే పరిమితమవుతుంది'  అని అన్నారు. గతంలోనూ తాను వందలాది కేసులు ఎదుర్కొన్నానని, ప్రతిసారి నిజాయితీపరుడుగానే వాటి నుంచి బయటపడ్డానని పేర్కొన్నారు.


'నేను రాజీనామా చేస్తారని మీరు (సిద్ధరామయ్య) వంద సార్లు పైనే చెప్పారు. నేను మరోసారి మీరు వివరణ ఇస్తున్నాను. ప్రధాని మోదీ, అమిత్‌షా, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నంత వరకూ ఎలాంటి ఢోకా లేదు. అలాగే ఎన్ని కేసులు బనాయించినప్పటికీ పోరాడుతూనే ఉంటాను. సీఎంగా కొనసాగుతాను. మేము 150కి పైగా సీట్లు గెలుచుకుంటాం. మీరు (సిద్ధరామయ్య) విపక్ష స్థానంలోనే కూర్చుంటారు' అని యడియూరప్ప అన్నారు.

Updated Date - 2021-02-06T20:44:11+05:30 IST