నాకు రాజకీయాలు రావు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-14T23:22:39+05:30 IST

ల నెలా 1,000 రూపాయల హామీ పంజాబ్‌లో కూడా కేజ్రీవాల్ ఇచ్చారు. పంజాబ్‌లోని 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ అందజేస్తామని పలుమార్లు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాజాగా ఇదే వాగ్దానం..

నాకు రాజకీయాలు రావు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: తనకు రాజకీయాలు చేయడం రాదని, తనకు రాజకీయాలు తెలియవని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సందర్భంగా ఆ రాష్ట్రంలో మంగళవారం ఆప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేజ్రీవాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పని ఎలా చేయాలో తెలుసని, అయితే రాజకీయాలు చేయడం మాత్రం తెలియదని అన్నారు.


‘‘నేను నాయకుడిని కాదు. నాకు రాజకీయాలు ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ పని ఎలా చేయాలో బాగా తెలుసు. ఢిల్లీలో అది చేసి చూపించాను. ఢిల్లీలో మేము 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇక్కడ కూడా ఇస్తాం. అంతే కాకుండా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,000 రూపాయల చొప్పున నెల నెలా అందజేస్తాం’’ అని కేజ్రీవాల్ అన్నారు.


నెల నెలా 1,000 రూపాయల హామీ పంజాబ్‌లో కూడా కేజ్రీవాల్ ఇచ్చారు. పంజాబ్‌లోని 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ అందజేస్తామని పలుమార్లు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాజాగా ఇదే వాగ్దానం ఉత్తరాఖండ్‌లో, గోవాలో కూడా చేస్తున్నారు. అయితే ఢిల్లీలో ఇలాంటి పథకం ఏం లేకపోవడం గమనార్హం.

Updated Date - 2021-12-14T23:22:39+05:30 IST