ఇంటింటికీ వ్యాక్సిన్‌తోనే.. కరోనాకు చెక్‌..

ABN , First Publish Date - 2021-05-09T16:28:00+05:30 IST

ఇంటింటికీ వ్యాక్సిన్‌ వేయడం ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేయగలమని, రాష్ట్రంలో కరోనా వైరస్‌ పూర్తిగా అదుపుతప్పిందని రోజుకు అరలక్షమందికి సోకుతోందని ఇటువంటి తరుణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ చివరి

ఇంటింటికీ వ్యాక్సిన్‌తోనే.. కరోనాకు చెక్‌..


బెంగళూరు: ఇంటింటికీ వ్యాక్సిన్‌ వేయడం ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేయగలమని, రాష్ట్రంలో కరోనా వైరస్‌ పూర్తిగా అదుపుతప్పిందని రోజుకు అరలక్షమందికి సోకుతోందని ఇటువంటి తరుణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ చివరి అస్త్రం కాదని ప్ర భుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సమన్వయం చేసుకుని ప్రభుత్వమే ఇంటింటా వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ ప్రారంభించాలని ప్రముఖ కేన్సర్‌ వైద్యనిపుణుడు డాక్టర్‌ యూఎస్‌ విశాల్‌రావ్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపట్ల అప్రమత్తత పాటించాలని, పెనుముప్పులో ఇరుక్కున్నట్టు అయ్యిందన్నారు. తొలి విడత కొవిడ్‌ కాలంలో అమలు చేసిన విధానాలు మరోసారి అమలు చేయాల్సి ఉండేదన్నారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా నిబంధనలు విధిస్తోందని, భారత్‌లో పరిస్థితిని చూసి ప్రపంచదేశాలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వమే ఇంటింటికీ వ్యాక్సిన్‌ వేస్తేనే కొవిడ్‌ నుంచి కోలుకునేందుకు వీలుందని నియంత్రణ సాధ్యమని విశాల్‌రావ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రోజూ 50వేల మందికి కరోనా వస్తోందన్నారు. రాష్ట్రం లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కలిపితే 1.20 లక్షల పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. వీటిలో 50 వేలు ఐసీయూ వెంటిలేటర్‌లు ఉన్నాయన్నారు. రోజూ నమోదయ్యే 50 వేలలో 17 శాతం మందికి ఐసీయూ వెంటిలేటర్‌లు అవసరమన్నారు. ఈ లెక్కన రోజూ 8వేలకుపైగా ఐసీయూ బెడ్‌లు స మకూర్చాల్సి ఉందన్నారు. ఇలా రాష్ట్రంలో ఐసీయూ పడకలు దక్కని పరిస్థితి నెలకొందన్నారు. నెలకు 2.55 లక్షల పడకలు అవసరమన్నారు. ఈ సౌలభ్యాలు ఉన్నఫళంగా అమలు చేయడం సాధ్యం కాదన్నారు. పరిస్థితి అదుపు తప్పుతోందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వ్యాక్సినేషన్‌ కరోనా వైర్‌సను ఎదురించే ఏకైక పరిహారమన్నారు. కరోనా వైరస్‌ గాలిలో 3 గంటలపాటు జీవించి ఉంటుందని, ప్ర జలు ఇప్పటికీ సక్రమంగా ఉపయోగించడం లేదని, అందుకే వైరస్‌ బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా తప్పనిసరిగా మాస్కు వేసుకోవాలని లేనిపక్షంలో వైర్‌స క గురికావడం తథ్యమన్నారు. భవిష్యత్తులో పరిస్థితి నియంత్రణలోకి రాకుంటే వేలాదిమంది ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందన్నారు. పోలియో చుక్కల తరహాలో రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. కఠిన లాక్‌డౌన్‌ అవసరమని, అలాగని లాక్‌డౌన్‌తోనే వైరస్‌ నియంత్రణ సాధ్యం కాదన్నారు. వ్యాక్సిన్‌ డ్రైవ్‌ సెంటర్‌లలో భౌతికదూరం కనుమరుగవుతోందని, వ్యాక్సిన్‌ కేంద్రాలే కరోనాను అంటించే కేంద్రాలుగా మారుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కట్టడి చేయాలని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-05-09T16:28:00+05:30 IST