1,100 ఏళ్ల కిందటే ఆస్పత్రి

ABN , First Publish Date - 2021-05-20T07:39:10+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమిళనాట చోళరాజులు వెయ్యేళ్ల క్రితమే ఆస్పత్రులు నిర్మించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది

1,100 ఏళ్ల కిందటే ఆస్పత్రి

కంచి సమీపాన 15 పడకలతో పురాతన వైద్యశాల! 

చోళరాజులు నిర్మించినట్లు ఆలయ శిలాశాసనం 


చెన్నై, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమిళనాట చోళరాజులు వెయ్యేళ్ల క్రితమే ఆస్పత్రులు నిర్మించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కాంచీపురం సమీపంలోని ఓ ఆలయంలో ఇటీవల వెలుగుచూసిన శిలాశాసనంలో ఈ సంగతి వెల్లడైంది. సుమారు 1,100 ఏళ్లకు పూర్వం సెయ్యారు, వేగవతి, పాలారు అనే మూడు నదులు కలిసేచోట వీరరాజేంద్ర చోళుడు 15 పడకల సదుపాయంతో ఓ ఆస్పత్రిని నిర్మించి, ఇద్దరు వైద్యులను నియమించాడు. వీరిలో ఒకరు శస్త్రచికిత్సలో నిపుణులు. వీరితో పాటు తేలికపాటి శస్త్రచికిత్సల కోసం ఓ క్షురకుడు, మూలికలను సేకరించి, మందులు తయారు చేయడానికి ఇద్దరు సహాయకులు, రోగుల సంరక్షణకు మహిళా సేవకులను కూడా నియమించారు. వీరందరికీ వైద్యసేవలను బట్టి వరిధాన్యాలను వేతనంగా చెల్లించేవారు. ఈ వివరాలన్నీ కాంచీపురం సమీపంలోని తిరుముక్కూడల్‌ వద్ద ఉన్న వేంకటేశ పెరుమాళ్‌ ఆలయ శిలాశాసనంలో చక్కటి తమిళంలో పొందుపరచి ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-20T07:39:10+05:30 IST