పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం: నరవణే

ABN , First Publish Date - 2021-01-13T07:44:54+05:30 IST

తూర్పు లద్దాఖ్‌లో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్‌, చైనా త్వరలోనే ఓ ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నట్లు సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు.

పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం: నరవణే

న్యూఢిల్లీ, జనవరి 12: తూర్పు లద్దాఖ్‌లో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్‌, చైనా త్వరలోనే ఓ ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నట్లు సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు. ఇరు దేశాలూ అక్కడి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

అదే సమయంలో అక్కడ ఎటువంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనడానికి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సైనిక దినోత్సవానికి ఒకరోజు ముందు మంగళవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు.  చైనా తన బలగాలను భారీగా తరలిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా ఈవిధంగా చేయక తప్పడం లేదని పేర్కొన్నారు.


Updated Date - 2021-01-13T07:44:54+05:30 IST