హిందువులకు మాత్రమే... పలు ఆలయాల ముందు ప్లెక్సీలు!

ABN , First Publish Date - 2021-03-22T11:51:31+05:30 IST

ఉత్తరాఖండ్‌లో హిందూ యువవాహిని కొత్త నినాదం అందుకుంది.

హిందువులకు మాత్రమే... పలు ఆలయాల ముందు ప్లెక్సీలు!

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో హిందూ యువవాహిని కొత్త నినాదం అందుకుంది. పలు ఆలయాల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, హిందూయేతరులకు ప్రవేశం లేదంటూ దానిపై నినాదం రాసింది. ఈ విధంగా పలు ఆలయాల ముందు బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హిందూ యువవాహిని రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ వాధ్వా మాట్లాడుతూ హిందూ యువవాహిని ప్రధాన కార్యదర్శి జీతూ రాంధ్వా నేతృత్వంలో రాష్ట్రంలోని పలు మందిరాల్లో ఈ విధమైన ప్రచారం ప్రారంభించామన్నారు. 


డెహ్రాడూన్‌లోని డోయీవాలా, సెలాకుయీ, ప్రేమ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని 50 మందిరాల ముందు ఇటువంటి బ్యానర్లు ఏర్పాటు చేసి, హిందూ సంస్కృతి పవిత్రతను కాపాడేందుకే హిందూయేతరులకు ప్రవేశం లేదనే నినాదాన్ని రాశామన్నారు. హిందువులంతా ఏకమై తమ శక్తిని చాటాలని, హిందూ సమాజ పరిరక్షణకు పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ బ్యానర్లు ఏర్ఫాటు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-03-22T11:51:31+05:30 IST