16 వరకు 'కరోనా కర్ఫ్యూ': ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-05T22:31:23+05:30 IST

16 వరకు 'కరోనా కర్ఫ్యూ': ప్రభుత్వం

16 వరకు 'కరోనా కర్ఫ్యూ': ప్రభుత్వం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 మహమ్మారి నివారణకు మే 6 నుంచి మే 16 వరకు 'కరోనా కర్ఫ్యూ' విధించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ కాలంలో అన్ని కార్యాలయాలు మూసివేయబడతాయని, అవసరమైన సేవలు మాత్రమే అనుమతించబడతాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రానికి వచ్చే ప్రజలకు నెగటివ్ కోవిడ్-19 నివేదిక తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-05-05T22:31:23+05:30 IST