ఆర్మీ స్థావరంపై గ్రనేడ్‌ దాడి.. హై అలర్ట్‌

ABN , First Publish Date - 2021-11-23T08:11:32+05:30 IST

ఆర్మీ స్థావరం లక్ష్యంగా దుండగులు చేసిన గ్రనేడ్‌ దాడితో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఉలిక్కిపడింది...

ఆర్మీ స్థావరంపై గ్రనేడ్‌ దాడి.. హై అలర్ట్‌

పఠాన్‌కోట్‌, నవంబరు 22: ఆర్మీ స్థావరం లక్ష్యంగా దుండగులు చేసిన గ్రనేడ్‌ దాడితో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఉలిక్కిపడింది. ధరమ్‌పూల్‌ ప్రాం తంలోని ఆర్మీ స్థావరం త్రివేణి ద్వారం వద్దకు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు గ్రనేడ్‌ విసిరి పారిపోయినట్లు ఎస్పీ సురేంద్ర లాంబా తెలిపారు. ఎలాంటి ప్రాణహానీ జరగలేదని చెప్పారు. అత్యంత భద్రత నడుమ ఉండే ఆర్మీ స్థావరంపై గ్రనేడ్‌ దాడితో నగరంలో హైఎలర్డ్‌ ప్రకటించారు. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

Updated Date - 2021-11-23T08:11:32+05:30 IST