డీఎంకేలో భారీగా చేరికలు

ABN , First Publish Date - 2021-02-08T12:04:48+05:30 IST

జిల్లావ్యాప్తంగా డీఎంకేలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని, ఇదే పార్టీ విజయానికి నిదర్శమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరాజన్‌ పేర్కొన్నారు. తిరువళ్లూర్‌ జిల్లా...

డీఎంకేలో భారీగా చేరికలు

చెన్నై/గుమ్మిడిపూండి(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా డీఎంకేలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని, ఇదే పార్టీ విజయానికి నిదర్శమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరాజన్‌ పేర్కొన్నారు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి యూనియన్‌ కవరపేట సమీపం పుదువాయల్‌ గ్రామంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నూతన కార్యకర్తల స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గోవిందరాజన్‌ సమక్షంలో డివిజన్‌లోని గురవరాజు కండ్రికై, బిల్లాకుప్పం, సురవారి కండ్రిక, పెరియపులియూర్‌ తదితర గ్రామాలకు చెందిన వందకుటుంబాలు డీఎంకేలో చేరాయి. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోవిందరాజన్‌ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీని వీడి డీఎంకేలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఎల్లాపురం యూనియన్‌ కార్యదర్శి మూర్తి, పెరియపాళయం నగర కార్యదర్శి శక్తివేల్‌, పూండి పట్టణ కార్యదర్శి చంద్రశేఖర్‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-08T12:04:48+05:30 IST