ఉత్తరాఖండ్‌కు భారీ నష్టం వాటిల్లింది: సీఎం

ABN , First Publish Date - 2021-10-20T19:06:57+05:30 IST

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపిన లేని వర్షాలు, కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి..

ఉత్తరాఖండ్‌కు భారీ నష్టం వాటిల్లింది: సీఎం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపిన లేని వర్షాలు, కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 46కు చేరింది. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారంనాడు కుమావ్ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని, సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్టు మీడియాకు తెలిపారు. రాష్ట్రం కోలుకోవడానికి సమయం తీసుకుంటుందని చెప్పారు. సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు.


కాగా, బుధవారం నుంచి వర్షపాతం క్రమంగా తగ్గుముఖం పడుతుందని, వారాంతానికి మళ్లీ పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వారంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వరదలుగా రూపాంతరం చెంది, కొండచరియలు విరిగిపడి పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలతో పాటు స్థానిక యంత్రాంగం సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాయి. 

Updated Date - 2021-10-20T19:06:57+05:30 IST