జర్మనీలో శవాల కుప్పలు

ABN , First Publish Date - 2021-01-13T07:32:08+05:30 IST

కరోనా ఇన్ఫెక్షన్లు, మరణాలతో జర్మనీలోని మైసెన్‌ నగరం శవాల దిబ్బగా మారింది. నగరంలో ఉన్న శ్మశాన వాటిక పరిసరాల్లో.. రోడ్ల పక్కన.. శవ పేటికలు,

జర్మనీలో శవాల కుప్పలు

న్యూయార్క్‌, జనవరి 12: కరోనా ఇన్ఫెక్షన్లు, మరణాలతో జర్మనీలోని మైసెన్‌ నగరం శవాల దిబ్బగా మారింది. నగరంలో ఉన్న శ్మశాన వాటిక పరిసరాల్లో.. రోడ్ల పక్కన.. శవ పేటికలు, సేఫ్టీ కవర్లలో ప్యాక్‌ చేసిన మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. మృతదేహాల దహనానికి ఎక్కువ సమయం పట్టడం వల్లే శవాలు పేరుకుపోయాయని శ్మశానవాటిక నిర్వాహకుడు తెలిపారు. మలేసియాలో కేసులు పెరగడంతో ప్రభు త్వం 8నెలల ఎమర్జెన్సీ విధించింది. అయితే.. విపక్షాలు, విద్యావంతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.


మలేసియాలో రోజూ సగటున 2 వేల కేసులు నమోదవుతున్నాయి. కొత్త స్ర్టెయిన్‌ కరోనా వైరస్‌ విజృంభణతో దక్షిణాఫ్రికా వచ్చే నెల 15 వరకు సరిహద్దులను మూసివేసింది. అమెరికా, బ్రిటన్‌ పర్యాటకులు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు చూపించాలని న్యూజిలాండ్‌ షరతు విధించింది.


మరోవైపు, భారత్‌లో కరోనా వైరస్‌ భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 12,584 కేసులు కొత్తగా నమోదుకాగా, 18,385 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. ఏడు నెలల(జూన్‌ 17) తర్వాత మళ్లీ అదే స్థాయిలో సోమవారం కొత్త కేసుల్లో తగ్గుదల నమోదైంది. సోమవారం 167 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-01-13T07:32:08+05:30 IST