జనవరి 6కు ముందే నీట్-పీజీ కౌన్సిలింగ్

ABN , First Publish Date - 2021-12-31T22:04:38+05:30 IST

నీట్-పీజీ కౌన్సిలింగ్‌ను జనవరి 6వ తేదీకి ముందే ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ..

జనవరి 6కు ముందే నీట్-పీజీ కౌన్సిలింగ్

న్యూఢిల్లీ: నీట్-పీజీ కౌన్సిలింగ్‌ను జనవరి 6వ తేదీకి ముందే ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తమకు హామీ ఇచ్చినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. నీట్-పీజీ కౌన్సిలింగ్‌ నిర్వహణకు జరుగుతున్న జాప్యానికి నిరసనగా 14 రోజుల దేశవ్యాప్త ఆందోళనకు ఇచ్చిన పిలుపును ఐఎంఏ ఇప్పటికే ఉపసంహరించుకుంది. జనవరి 6కు ముందే కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని, డాక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆరోగ్య మంత్రి తమకు హామీ ఇచ్చినట్టు ఐఎంఏ అధ్యక్షుడు సహజానంద్ ప్రసాద్ సింగ్ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.


నీట్-పీజీ కౌన్సిలింగ్ జాప్యంపై రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన చేపట్టడం, పోలీసులు కొందరు డాక్టర్లపై చేయిచేసుకున్నారనే ఆరోపణలు రావడంతో 14 రోజుల దేశ్యావ్యాప్త ఆందోళనకు ఐఎంఏ పిలుపునిచ్చింది. దీంతో రెసిడెండ్ డాక్టర్స్ అసోసియేషన్ ఫెడరేషన్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ మధ్య చర్చలు జరిగాయి. అనంతరం, దేశవ్యాప్త ఆందోళనకు ఇచ్చిన పిలుపును ఐఎంఏ వెనక్కి తీసుకుంది. ఢిల్లీ పోలీసులు, డాక్టర్స్ అసోసియేషన్ పరస్పర విశ్వాసం చాటుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2021-12-31T22:04:38+05:30 IST