సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించిన మరో రాష్ట్రం

ABN , First Publish Date - 2021-05-02T21:22:50+05:30 IST

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించగా, ఇప్పుడు హర్యానా కూడా అదే బాటలో

సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించిన మరో రాష్ట్రం

చండీగఢ్: కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించగా, ఇప్పుడు హర్యానా కూడా అదే బాటలో నడిచింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ఏడు రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. రేపటి నుంచి ఏడు రోజులపాటు రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కాగా, హర్యానా ప్రభుత్వం ఇప్పటికే పంచకుల, గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, రోహ్‌తక్, కర్నాల్, హిసార్, సిర్సా, ఫతేబాద్ జిల్లాల్లో శుక్రవారం వారాంతపు లాక్‌డౌన్ ప్రకటించింది. తాగా, ఇప్పుడు రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. మరోవైపు, ఢిల్లీలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో వారం పాటు ప్రకటించారు. కాగా, ఒడిశా ప్రభుత్వం కూడా రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 19 వరకు రెండు వారాలపాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-05-02T21:22:50+05:30 IST