చేనేత సహకార శాఖలో 12 లక్షల ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-10-29T16:51:09+05:30 IST

రాష్ట్ర చేనేత సహకార శాఖలో 12లక్షల మందికి ఉద్యో గ అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి, చక్కెర శాఖామంత్రి బి.పాటీల్‌ మునేనకొప్ప పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పంచాయతీ నజీర్‌ సభాంగణంలో గురువా

చేనేత సహకార శాఖలో 12 లక్షల ఉద్యోగాలు

బళ్లారి(Karnataka): రాష్ట్ర చేనేత సహకార శాఖలో 12లక్షల మందికి ఉద్యో గ అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి, చక్కెర శాఖామంత్రి బి.పాటీల్‌ మునేనకొప్ప పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పంచాయతీ నజీర్‌ సభాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ఉత్తర విభాగం బళ్ళారి విభాగం స్థాయి చేనేత, జవళి శాఖ ప్రగతి పరిశీలనా సభ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్‌ హ్యుండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ అనే కొత్త పథకాన్ని జారీకి తీసుకొచ్చిందని, దీంతో తమ రాష్ట్రానికి సద్వినియోగం చేసుకునే దిశలో కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో చేనే, జౌళీ శాఖ ద్వారా 132 కోట్ల రూపాయల సబ్సీడి మొత్తాన్ని అర్హులైన లబ్దిదారులకు ఇవ్వనున్నట్లు, ఇందులో ఎస్సీ వర్గాలతో చేరి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 121 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. జౌళీ శాఖలో చేనేత సముదాయం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డెవల్‌పమెంట్‌ ప్రోర గామ్‌ అనే బృహత్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం జారీకి తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా చేనేత, జౌళీ శాఖకురూ 10వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. అనంతరం నగరంలోని పోలెక్స్‌ జీన్స్‌ తయారు విభాగం, వాషింగ్‌ యూనిట్‌ను మంత్రి సందర్శించి పరిశీలించి యూనిట్‌ యజమానులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలెక్స్‌ హనుమంతప్ప, పొలెక్స్‌ మల్లికార్జున, అధికారి గిరీష్‌ మైసూరు, చేనేత జవళి శాఖ అధికారులు విఠల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T16:51:09+05:30 IST