300 బాలికల దత్తత.. సామూహిక పెళ్లిళ్లు

ABN , First Publish Date - 2021-12-07T07:03:35+05:30 IST

అనాథ పిల్లలను చేరదీయాల్సి వస్తే ఒకరిద్దరిని దత్తత తీసుకునేవాళ్లను చూసి ఉంటాం. కానీ ఆయన 300 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. అందరూ బాలికలే...

300 బాలికల దత్తత..  సామూహిక పెళ్లిళ్లు

ఓ వ్యాపారవేత్త ఔదార్యం


అహ్మదాబాద్‌, డిసెంబరు 6: అనాథ పిల్లలను చేరదీయాల్సి వస్తే ఒకరిద్దరిని దత్తత తీసుకునేవాళ్లను చూసి ఉంటాం. కానీ ఆయన 300 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. అందరూ బాలికలే కావడం మరో విశేషమైతే వారికి సామూహికంగా పెళ్లిళ్లు కూడా చేయడం మహా విశేషం. గుజరాత్‌లోని సూరత్‌కు  చెందిన మహేశ్‌ సవానీ వ్యాపారవేత్తదీ ఆదర్శం! ఆయన ఏటా మతాలకు అతీతంగా ఎంతోమంది అనాథలను చేరదిసి వారి బాగోగులను చూస్తుంటారు. ఏటా వారిలో కొందరికి పెళ్లిళ్లూ చేస్తుంటారు. శని, ఆది, సోమవారాల్లో ఆయన 300 మంది అమ్మాయిలకు వివాహం చేశారు. గత పదేళ్లుగా ఆయన ‘దత్తత తండ్రి’గా వాసికెక్కారు. 

Updated Date - 2021-12-07T07:03:35+05:30 IST