కరోనాని ఓడించే ‘ఆయుధ్ అడ్వాన్స్’.... నాలుగు రోజుల్లో ప్రభావం!
ABN , First Publish Date - 2021-04-20T12:32:18+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ అల్లాడిస్తున్న ప్రస్తుత తరుణంలో...
అహ్మదాబాద్: కరోనా సెకెండ్ వేవ్ అల్లాడిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆసుపత్రులలో బెడ్‌లు దొరకక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా చికిత్సలో కీలకంగా మారిన రెమిడెసివిర్ ఇంజక్షన్ కొరత మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ‘ఆయుధ్ అడ్వాన్స్’ అనే నూతన ఔషధాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చిన కంపెనీ ఈ ఔషధం కరోనాపై సమర్థవంతంగా పోరాడుతుందని చెబుతోంది. అహ్మదాబాద్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ చేశామని, విజయవంతమైన ఫలితాలు వచ్చాయని పేర్కొంది.
కేవలం నాలుగు రోజల వ్యవధిలో ‘ఆయుధ్ అడ్వాన్’ కరోనా బాధితులపై ప్రభావవంతంగా పనిచేసిందని, వారి శరీరంలోని కరోనా వైరస్ లోడ్‌ను చాలావరకూ తగ్గించిందని ఆ కంపెనీ పేర్కొంది. ఈ ఔషధం వినియోగించిన తరువాత కరోనా బాధితులకు నెగిటివ్ రిపోర్టు వచ్చిందని సంస్థ పేర్కొంది. ఈ ఔషధానికి సంబంధింంచిన హ్యూమన్ ట్రయల్స్ 2020 అక్టోబరులో నిర్వహించామని సంస్థ పేర్కొంది. ఈ ‘ఆయుధ్ అడ్వాన్స్’ ఔషధాన్ని గుజరాత్‌కు చెందిన శుక్లా అస్హర్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది.