గుబ్బిలో యుద్ధ విమానాల తయారీ విభాగం

ABN , First Publish Date - 2021-10-31T17:54:52+05:30 IST

తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా బిదరేహళ్ళి కావల్‌లో ఉన్న హెచ్‌ఏఎల్‌ లఘు హెలీక్యాప్టర్‌ల తయారీ విభాగాన్ని మరింతగా విస్తరించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తుమకూరు లోక్‌సభ సభ్యుడు జీఎస్‌ బసవరాజ్‌ ఈ విషయాన్ని

గుబ్బిలో యుద్ధ విమానాల తయారీ విభాగం

బెంగళూరు: తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా బిదరేహళ్ళి కావల్‌లో ఉన్న హెచ్‌ఏఎల్‌ లఘు హెలీక్యాప్టర్‌ల తయారీ విభాగాన్ని మరింతగా విస్తరించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తుమకూరు లోక్‌సభ సభ్యుడు జీఎస్‌ బసవరాజ్‌ ఈ విషయాన్ని శనివారం మీడియాకు చెప్పారు. మినీ హెలీక్యాప్టర్‌ల విభాగానికి పక్కనే ఉన్న 529 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది రైతులు తమ భూమిని హెచ్‌ఏఎల్‌కు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదిత భూమి పక్కనే మరో 1093 ఎకరాల అటవీశాఖకు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రయత్నాలు కొలిక్కి వచ్చాక ఇందు లో 614 ఎకరాలలో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఆత్మనిర్భ ర్‌లో భాగంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.6,400 కోట్ల ఖర్చుతో యుద్ధ విమానాల తయారీ విభాగాన్ని ప్రారంభించే అవకాశం ఉందన్నారు. 2022 ఆగస్టు నాటికి ఈ యుద్ధ విమాన తయారీ కేంద్రానికి స్వయంగా ప్రధాని నరేంద్రమోదీతో శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. 

Updated Date - 2021-10-31T17:54:52+05:30 IST