జీఎస్టీ పరిహారం బకాయిలు 10,662 కోట్లు

ABN , First Publish Date - 2021-03-24T10:30:24+05:30 IST

కరోనా ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థపై పడినందువల్లనే ఏపీకి చెల్లించాల్సిన జీఎస్టీ నష్ట పరిహారం బకాయిలు పేరుకుపోయాయని, ఇప్పటివరకు మొత్తం రూ.10,662 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

జీఎస్టీ పరిహారం బకాయిలు 10,662 కోట్లు

న్యూఢిల్లీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థపై పడినందువల్లనే ఏపీకి చెల్లించాల్సిన జీఎస్టీ నష్ట పరిహారం బకాయిలు పేరుకుపోయాయని, ఇప్పటివరకు మొత్తం రూ.10,662 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రూ.5,269 కోట్లు, 2020 జూన్‌ నుంచి 2021 జనవరి వరకు రూ.5,393 కోట్ల చొప్పున ఏపీకి చెల్లించాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-24T10:30:24+05:30 IST