జీఆర్టీకి వరుసగా నాలుగోఏట జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2021-08-21T13:38:58+05:30 IST

సంప్రదాయ, అత్యాధునిక సాంకేతికతల విస్త్రతశ్రేణి నగలతో సుమారు ఆరు దశాబ్దాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటున్న జీఆర్టీ జ్యువెలర్స్‌ సంస్థ జాతీయస్థాయిలో పలు అవార్డులను సొంతం చేసు

జీఆర్టీకి వరుసగా నాలుగోఏట జాతీయ అవార్డు

చెన్నై: సంప్రదాయ, అత్యాధునిక సాంకేతికతల విస్త్రతశ్రేణి నగలతో సుమారు ఆరు దశాబ్దాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటున్న జీఆర్టీ జ్యువెలర్స్‌ సంస్థ జాతీయస్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకుంది. ‘ప్లాటినం గిల్డ్‌ ఇంటర్నేషనల్‌’ గత అక్టోబరు 16నుంచి నవంబరు 15 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్లాటినం సీజన్‌ ఆఫ్‌ హోప్‌ సమయంలో జీఆర్టీ జ్యువెలర్స్‌ షోరూం జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. స్థానిక ఉస్మాన్‌రోడ్డు షోరూం దక్షిణమండలంలో మొదటి రన్నర్‌ ఆఫ్‌ అవార్డు సాధించింది. జాతీయస్థాయిలో మొదటి రన్నర్‌ ఆఫ్‌ అవార్డు గెలిచిన అత్యుత్తమ సేల్స్‌ మేనేజర్‌, దక్షిణ మండలపు అత్యుత్తమ సేల్స్‌ మేనేజర్లుగా ఎంపిక చేయబడినవారు జీఆర్‌టీ షోరూం వారే కావడం విశేషం. ఈ అవార్డులకు జీఆర్టీ వరుసగా నాల్గవమారు ఎంపికవ్వడం విశేషం. ఈ బహుమతుల గురించి జీఆర్టీ జ్యువెలర్స్‌ ఎండీ జీఆర్‌ ఆనంద్‌ - అనంత పద్మనాభన్‌ మాట్లాడుతూ.. తమ సంస్థ వరుసగా నాలుగు సంవత్సరాలు ఈ అవార్డులకు ఎంపికవ్వడం తమ సంస్థ ఉత్పాతదనలు, తమ సేవలు, వినియోదారులపట్ల తమకున్న స్నేహ సంబంధాలకు సంకేతమని తెలిపారు. మరో మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీఆర్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ఈ బహుమతులు రావడం తమకు, తమ సిబ్బందికి ఎంతో గర్వకారణమన్నారు. 

Updated Date - 2021-08-21T13:38:58+05:30 IST