అత్యవసర చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్

ABN , First Publish Date - 2021-12-09T00:18:28+05:30 IST

తమిళనాడులోని కానూరు సమీపంలో చోటుచేసుకున్న సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో ..

అత్యవసర చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్

న్యూఢిల్లీ: తమిళనాడులోని కానూరు సమీపంలో చోటుచేసుకున్న సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయారు. మొత్తం 14 మందిలో కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రస్తుతం తీవ్ర గాయాలతో వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఈ ఏడాది స్వాంతంత్ర్య దినోత్సవం (ఇండిపెండెన్స్ డే) రోజున 'శౌర్య చక్ర' పురస్కారం అందుకున్నారు. 2020లో ఏరియల్ ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఎల్‌సీఏ తేజాస్ యుద్ధ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినందునకు ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.

Updated Date - 2021-12-09T00:18:28+05:30 IST