గ్రూప్‌ అడ్మిన్లపై కేసులు పెట్టండి: కేరళ డీజీపీ

ABN , First Publish Date - 2021-12-25T09:19:33+05:30 IST

కేరళలో ఇటీవల వరుస రాజకీయ హత్యలు జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్‌ కాంత్‌ పోలీసు యం త్రాంగాన్ని అప్రమత్తం చేశారు...

గ్రూప్‌ అడ్మిన్లపై కేసులు పెట్టండి: కేరళ డీజీపీ

తిరువనంతపురం, డిసెంబరు 24: కేరళలో ఇటీవల వరుస రాజకీయ హత్యలు జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్‌ కాంత్‌ పోలీసు యం త్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల ను వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారం ప్రారంభంలో బీజేపీ నేత రంజిత్‌ శ్రీనివాసన్‌, ఎస్‌డీపీఐ నేత కేఎస్‌ షాన్‌ హత్యల తర్వాత సోషల్‌ మీడియాలో కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సందేశాలు పంపుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి అంశాలపై చర్చలు నిర్వహించే గ్రూపు అడ్మిన్లపై కేసులు పెట్టాలని సూచించారు. 

Updated Date - 2021-12-25T09:19:33+05:30 IST