యూజీ నీట్‌ ఫలితాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-10-29T08:19:22+05:30 IST

అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సులలో ప్రవేశానికి నీట్‌ ఫలితాలను ప్రకటించాల్సిందిగా సుప్రీంకోర్టు.. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ)ను ఆదేశించింది.

యూజీ నీట్‌ ఫలితాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఎన్టీఏకు సుప్రీం కోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 28: అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సులలో ప్రవేశానికి నీట్‌ ఫలితాలను ప్రకటించాల్సిందిగా సుప్రీంకోర్టు.. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ)ను ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. మహారాష్ట్రలో ఇద్దరు విద్యార్థుల ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లు తారుమారైన నేపథ్యంలో నీట్‌ ఫలితాలను నిలుపుదల చేయాలంటూ ఇటీవల బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. 

Updated Date - 2021-10-29T08:19:22+05:30 IST