ఇక కొవిడ్ మృతులకు ఉచితంగా దహన సంస్కారాలు

ABN , First Publish Date - 2021-05-18T14:18:49+05:30 IST

కొవిడ్ మృతుల దహన సంస్కారాలకు అయ్యే ఖర్చును భరించాలని జార్ఖండ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది....

ఇక కొవిడ్ మృతులకు ఉచితంగా దహన సంస్కారాలు

రాంచీ (జార్ఖండ్): కొవిడ్ మృతుల దహన సంస్కారాలకు అయ్యే ఖర్చును భరించాలని జార్ఖండ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కరోనా మృతుల దహన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా ప్రకటించారు. రామ్ ఘడ్ జిల్లాలో 80  పడకల కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం సోరెన్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కొవిడ్ మృతుల దహనానికి కట్టెలను ఉచితంగా ఇస్తామని, శ్మశానవాటికలో ఖననం కోసం సమాధులు తవ్వటానికి ఎలాంటి చార్జీలు విధించమని సీఎం చెప్పారు. మే మొదటివారంలో 3వేల మందికి పైగా ప్రజలు కరోనాతో మరణించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేస్తామని, కరోనా సోకిన వారిని కొవిడ్ కేర్ కేంద్రాలకు తరలిస్తామని, ఇంటి వద్ద ఉండి చికిత్స పొందే వారికి మెడికల్ కిట్లు అందిస్తామని సీఎం చెప్పారు. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకాలు అందించే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని సీఎం సోరెన్ వివరించారు.


Updated Date - 2021-05-18T14:18:49+05:30 IST